Header Banner

జగన్‌కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు! మంత్రి సవిత ఘాటు విమర్శలు!

  Thu Feb 20, 2025 19:25        Politics

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి సవిత సంచలన విమర్శలు చేశారు. అన్ని వ్యవస్థలను, శాంతిభద్రతలను జగన్ రెడ్డి నాశనం చేశారని ధ్వజమెత్తారు.

రైతన్నల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి లేదని మంత్రి ఎస్ సవిత విమర్శించారు. రెండు రోజులు ఏపీకి వచ్చి అల్లర్లు సృష్టించి తిరిగి బెంగళూరు వెళ్లి జగన్ రెడ్డి పబ్జీ ఆడుకుంటారని ఎద్దేవా చేశారు. ఇవాళ(గురువారం) మంత్రి సవిత తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ... వైసీపీ ఉనికిని కాపాడేందుకే జగన్ రెడ్డి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.ఎన్నికల నియమావళి గురించి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి తెలియదని చెప్పారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!

వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని.. అయినా జగన్ తీరులో మార్పు రావడం లేదని అన్నారు. రైతుల వేషంలో వైసీపీ మూకలు మిర్చి యార్డుకు వచ్చారన్నారు. 2017లో మిర్చి ధర రూ.7 వేలుగా ఉన్నప్పుడు రైతు నష్టపోతాడని రూ.1500 క్వింటాకు బోనస్ ఇచ్చి రైతులను చంద్రబాబు ఆదుకున్నారని గుర్తుచేశారు. జగన్ రెడ్డి పెట్టిపోయిన రూ.1680 కోట్ల ధాన్యం బకాయిలను తాము విడుదల చేశామని తెలిపారు. పోలీసులపై జగన్ రెడ్డి వాడిన భాష సరైనది కాదని అన్నారు. పిచ్చి ముదిరితే మరోసారి లండన్ వెళ్లి టాబ్లెట్స్ డోస్ పెంచుకోవాలని సలహా ఇచ్చారు.

నారా భువనేశ్వరిని అసభ్యకరంగా మాట్లాడిన అరాచకవాది కోసం మరో అరాచకవాది పరామర్శకు వెళ్లడం విచిత్రంగా ఉందని విమర్శలు చేశారు. అన్ని వ్యవస్థలను, శాంతిభద్రతలను నాశనం చేసిన జగన్ రెడ్డికి ఈ మంచి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం చూసి జీర్ణించుకోలేక జగన్ రెడ్డి తమ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. నిజంగా జగన్ రెడ్డి ప్రజాపక్షపాతి అయితే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. తప్పకుండా అతనికి మైక్ ఇస్తాం.. ప్రతీ విషయంపై చర్చించిస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 
 


   #AndhraPravasi #Andhrapradesh #savitha #politics #tdp #nda #chandrababu #pawankalyan #naralokesh